మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయా…? నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుందా…? అంటే అవుననే ప్రచారమే సాగుతోంది. నిహారిక పెళ్లి ఫిక్స్ అయింది అంటూ వార్తలొస్తున్నాయి.
మొన్నటి వరకు బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోయింది నిహారిక. అయితే… మెగా కుటుంబానికి చెందిన నిహారిక ఇలా ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫోటో షూట్ చేయటంపై ఫాన్స్ కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు.
తాజాగా నిహారిక ఫోటోలు మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాయి. పెళ్లి కూతురుగా తయారై, ముస్తాబైన నిహారిక తన ఫోటోలను నెట్టింట్లో పెట్టింది. దీంతో నిహారిక పెళ్లి పీటలెక్కబోతుందన్న ప్రచారం ఊపందుకుంది.
Advertisements
అయితే… ఈ ఫోటోలు నిహారిక పెళ్లి ఫిక్స్ అయినందుకు కాదట. నిహారిక ఓ జ్యూవెలరీ యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఆ యాడ్ కోసం చేసిన ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది.