సైరా మూవీ తరువాత మెగా ప్రాజెక్ట్ ఏంటి..? ఇదీ మెగా అభిమానులలో ప్రస్తుతం నడుస్తున్న డిస్కషన్. తాజాగా అందిన సమాచారం ప్రకారం పృధ్విరాజ్ డైరెక్ట్ చేసిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’లోనే చిరంజీవి చేస్తున్నారు. ఐతే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇది ఒక్క మెగాస్టార్ మూవీ మాత్రమే కాదు, మెగా ఫ్యామిలీ నటించే మూవీ. అక్కినేని వారి ‘మనం’ తరహాలో మూడు తరాలు నటులు ఇందులో నటించబోతున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ అండ్ రామ్‌చరణ్ తేజ్..
నమ్మలేకపోతున్నారా…? ఐతే, కొద్దిరోజులు ఆగండి. చిరంజీవికి ఎప్పటి నుంచో ‘మనం’ తరహా ఫ్యామిలీ మూవీ చేయాలని వుంది. తన తమ్ముడు, తనయుడు, వీలయితే మేనల్లుడితో మూవీ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకు తగిన కథ కోసం వెతికే క్రమంలో మోహన్‌లాల్ లూసిఫర్ గురించి ఎవరో చెప్పడం, దాన్ని ఆయన చెర్రీకి చెప్పి పరిశీలించమని చెప్పడం జరిగిపోయింది.
చెర్రీ కూడా తన బాబాయ్‌కి తగిన పాత్ర.. స్టోరీ కోసం సెర్చింగ్‌లో వున్నాడు. తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చెర్రీ, పాలిటిక్స్‌లో వున్న బాబాయ్ కోసం కూడా తగిన కథ దొరికితే చరిత్రలో నిలిచిపోయే మూవీ చేయాలని సంకల్పించాడని సమాచారం. లూసిఫర్ అయితే ఏకంగా తండ్రి, బాబాయ్, తను కూడా నటించే అవకాశం వుంటుంది.
లూసిఫర్ స్టోరీ ప్రకారం ఇందులో నాలుగు ప్రధాన పాత్రలు వుంటాయి. మోహన్‌లాల్, అతనికి సహాయపడే పాత్రలో పృధ్విరాజ్, సీయం పాత్రలో మరో యువ కథానాయకుడు టివినో థామస్ నటించారు. మోహన్‌లాల్ కేరక్టర్ చిరంజీవికి సూటవుతుందని, పృధ్విరాజ్ పాత్రలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, థామస్ పాత్రలో రామ్‌చరణ్ తేజ్ నటించవచ్చునని అంటున్నారు.
ఇందులో మోహన్‌లాల్‌కు సరిసమానమైన లేడీ పాత్ర ఒకటుంది. అక్కడ మంజూ వారియర్ పోషించారు. ఈ పాత్రకు ‘సరిలేరు నీకెవ్వరు’ ద్వారా సెకండిన్నింగ్స్ ప్రారంభిస్తున్న లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి సరిపోతారని అనుకుంటున్నారు. ఆమెతో దీనిపై ప్రాథమికంగా మాట్లాడినట్టు సమాచారం.
ఇలావుంటే, లూసిఫర్ మూవీ సీక్వెల్ కూడా మలయాళంలో మొదలు కాబోతోంది. ‘ఎంపురాన్’ పేరుతో దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ పార్టు కాకుండా మూడో భాగం కూడా వుంటుందని అంటున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రముఖ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మురళీ గోపీ కథను అందించారు. కేరళలో రాజకీయ అనిశ్చితి సందర్భంగా ఓ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మోహన్‌లాల్ రాజకీయ నాయకుడిగా నటించారు.