అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అక్కడకు చేరుకున్నారు. వారితోపాటు వరుణ్ తేజ్, నిహారిక వచ్చారు. ఇతర కుటుంబసభ్యులు వస్తున్నారు.
తమ అభిమాన హీరోకు గాయాలు కావడంతో అభిమానులు సైతం అపోలో ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి డాక్టర్లు తేజ్ కు చికిత్స అందిస్తున్నారు. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. బోన్స్ ఏమన్నా దెబ్బతిన్నాయా అని స్కానింగ్ తీస్తున్నారు.