మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిన రోజు శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక దగ్గరికి చేరుకున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి అంజనా దేవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అయితే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యలో అంజనాదేవి కూర్చోగా చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులు, పవన్ కళ్యాణ్ సోదరీమణులు విజయదుర్గ, మాధవి ఇలా అందరూ చుట్టూ కూర్చున్నారు. ఈ ఫోటోను నాగబాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.