ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో చిత్ర బృందాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ప్రశంసలు, శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో కొందరు నటులు చేసిన ట్విట్లు వారి మధ్య పోటీని తెలియజేస్తున్నాయి. మరి కొందరూ చేసిన ట్విట్ల వల్ల వారి మధ్య ఉన్న విభేదాలను తెలియజేస్తున్నాయి.
తాజాగా మరోసారి అల్లు మెగా ఫ్యామిలీ ల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడమే. ఇక ఆస్కార్ వచ్చింది అని తెలియగానే సినీ ఇండస్ట్రీకి చెందిన అలాగే రాజకీయ నాయకులు,నెటిజన్స్ అందరూ కూడా ఆర్ఆర్ఆర్ టీం ని అభినందించారు.అయితే తాజాగా అల్లు అర్జున్ ఆస్కార్ వచ్చినందుకు ఆర్ఆర్ఆర్ టీం కి స్పెషల్ విష్ చేశారు. అల్లు అర్జున్ తన ట్వీట్ లో ఏం చెప్పారంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం..
ఈ ఆస్కార్ అవార్డు రావడం భారతదేశానికి ఒక గొప్ప క్షణం. ఇక ఆస్కార్ వేదికపై మన తెలుగు పాటని ఒక ఊపు ఊపినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, అలాగే పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లకి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి అలాగే గ్లోబల్ స్టార్స్ నా లవ్లీ బ్రదర్స్ అయిన రాంచరణ్ , ఎన్టీఆర్ లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు.మీ డ్యాన్స్ తో స్టెప్పులతో ఈ ప్రపంచాన్ని ఉర్రుతలూగించారు. తెలుగు వాళ్ళ గర్వం తారక్ కి నా శుభాకాంక్షలు.
అలాగే ఈ అద్భుతమైన క్షణాలు ఆస్కార్ అవార్డు రావడానికి దోహదపడిన ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళికి స్పెషల్ గా శుభాకాంక్షలు. ఇది మన భారతదేశ సినిమా చరిత్రకే హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్లో చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్లో రామ్ చరణ్ ని ప్రస్తావించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియడంతో ప్రస్తుతం అల్లుఅర్జున్ చేసిన ట్వీట్ ని నందమూరి అభిమానులు రీ ట్వీట్ చేస్తున్నారు. దీంతో చాలామంది నెటిజ్న్స్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్లోనే అర్థమైంది. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.