ఆర్.ఆర్.ఆర్, ఆచార్య షూటింగ్ లతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్…. త్వరలో ఏస్ డైరెక్టర్ శంకర్ తో జతకట్టనున్నాడు. శంకర్ ఇండియన్-2 షూటింగ్ నిలిచిపోవటంతో తన తర్వాతి సినిమాపై ఇప్పటికే ఫోకస్ చేశాడు. ఈ మూవీ చరణ్ హీరోగా, పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా సినిమా తీసే శంకర్ కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్ కు సెట్ అవుతుందన్న అన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి.
తాజాగా దీనిపై మెగా ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. శంకర్-చరణ్ సినిమా సైన్స్ ఫిక్షన్ అని ఫిక్స్ అయిపోయారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ… ఇండియన్-2 తర్వాత సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందని చెప్పాడు. దీంతో ఆ సినిమా ఇదేనని మెగా ఫ్యాన్స్ సంబురపడుతున్నారు.