మెఘా కృష్ణారెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై జరుగుతోన్న ఐటీ దాడులు చివరి అంకానికి చేరాయి. నాలుగు రోజులుగా ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఐటీ అధికారులు, ఐదో రోజు అక్రమాస్తులకు సంబంధించిన రెండు సంచుల డాక్యుమెంట్లతో పాటు కోట్లాది రూపాయాలు విలువ చేసే అభరణాలను సీజ్ చేశారు.
అనుకున్నట్లుగానే… మెఘా సంస్థ అక్రమాల పుట్టి మునుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా వేల కోట్ల రూపాయల ఆధారాలు బయటపడుతున్నాయి. కేవలం ఒక్కబ్యాంకులో లాకర్‌లోనే కోట్లాది రూపాయాల బంగారువజ్రాభరణాలతో పాటు, రెండు సంచుల్లో డాక్యుమెంట్లు దొరటకం సంచలనం రేపుతోంది.
తొలివెలుగు సంపాదించిన సాక్ష్యాధారాల మేరకు…
మెఘా కృష్ణారెడ్డి ఆస్తులపై సోదాల్లో పాల్గొన్న టీమ్-2 సీజ్ చేసిన వివరాలు చూస్తే… బాలానగర్ ఆంధ్రాబ్యాంక్ లాకర్ నెంబర్ 169లో దొరికిన డాక్యుమెంట్లు, అభరణాలు సీజ్ చేశారు. ఇందులో మెఘా కృష్ణారెడ్డి బంధువుల పేర్లను స్పష్టంగా పేర్కొంది ఐటీ సంస్థ. కోట్లలో ఉన్న వాటి గురించి కుటుంబ సభ్యులు సరైన సమాధానాలు, ఆధారాలు చూపనందున సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇవి కేవలం ఆంధ్రాబ్యాంకులో మాత్రమే దొరికనవి. ఇంకా ఇతర బ్యాంకులు, లాకర్లలో మరిన్ని వేల కోట్ల ఆధారాలు దొరికే అవకాశం ఉంది. దాదాపు 5 గ్రూపులుగా ఐటీ సోదాలు నడుస్తున్నాయి. మిగతా టీంలు కూడా సీజ్‌ల పరంపర మొదలుపెట్టడంతో… అన్నీ ఒక దగ్గరికి చేరిస్తే, సీజ్ చేసిన బంగారు వజ్రాభరణాల మొత్తం వందల కోట్లను దాటడం ఖాయంగా కనపడుతోంది.