ఒ పక్క ఐటీ అధికారుల దాడులు, మరోపక్క ఈడీ విచారణకు రాబోతుంది అన్న భయాందోళనలో ఉన్న మెఘా కృష్ణారెడ్డి… తన కోపాన్ని మీడియా పై చూపిస్తున్నారు. ఇప్పటికే మీడియా అంతా తన గుప్పిట్లో ఉండగా… ఒకట్రెండు సంస్థలే తనను నిజాల్ని భయటపెడుతూ తనను ఇబ్బందిపెడుతున్నాయని గ్రహించిన ఆయన, మీడియాపై తన సిబ్బందితో దౌర్జన్యానికి తెర తీశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ప్రాజెక్టులు దక్కించుకున్న మెఘా కృష్ణారెడ్డి వేల కోట్లు సంపాదించారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నా చేతిలోనే ఉన్నాయి, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని విర్రవీగుతున్న మెఘా కృష్ణారెడ్డికి ఢీల్లి నుంచి వచ్చిన ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై జరుగుతున్న ఐటీ దాడుల విషయాన్ని బయటకు పొక్కకుండా దాదాపు అన్ని చానల్స్ ను మేనేజ్ చేసుకున్నారు మేఘ కృష్ణా రెడ్డి. కానీ అన్ని చానల్స్ డబ్బుకు అమ్ముడు పోవని తెలుసుకున్న మెఘా రౌడీలు దాడులు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఐటీ అధికారులు చేస్తున్న సోదాలపై లైవ్ ఇస్తున్న మీడియా చానల్స్ పై ప్రైవేట్ గుండాలతో బెదిరింపులకు దిగుతున్నారు. మా పర్మిషన్ లేకుండా ఎలా లైవ్ లు ఇస్తారు అని జర్నలిస్ట్ లపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
అయితే, జర్నలిస్ట్‌లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా ఉండాలో మాకు తెలుసు, మేం ఎంతో కాలంగా ఇలాంటి దాడులను మేం కవర్ చేస్తున్నాం… మీ బెదిరింపులకు భయపడబోం అంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే, మెఘా బెదిరింపులపై జర్నలిస్ట్ సంఘాలు ఒక్కటి కాకపోతే… మున్ముందు ఈ బెదిరింపులు, దాడులు ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేంటున్నారు జర్నలిస్ట్‌లు.