కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తాజాగా ఆచార్య సెట్ లో అడుగుపెట్టారు. కొరటాల శివతో కలిసి టీ తాగుతూ ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత మణిశర్మ చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.