మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ వరకు వచ్చాడు.
మగధీర సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత ఫ్లాప్స్ వచ్చినా ఎక్కడ వెనుకడుగు వెయ్యలేదు. ఇక పోతే ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా…. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ15 షూటింగ్ దశలో ఉంది.
అయితే తాజాగా చరణ్ కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చరణ్ తెల్ల లాల్చీ, పంచె తో మెట్ల పై కూర్చుని ఏదో రాస్తూ కనిపించారు. పక్కన పాత కాలపు చెప్పులు కూడా కనిపిస్తున్నాయి.
ఇది చూసిన చాలా మంది మెగా అభిమానులు అచ్చం బాబాయ్ పవన్ కళ్యాణ్ లానే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఆర్సీ 15 షూటింగ్ ఫోటో అని శంకర్ చరణ్ తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.