రాంచరణ్… మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ నటన పరంగా విమర్శకులను సైతం మెప్పించి స్టార్ హీరోగా ఎదిగాడు. తాజాగా రాంచరణ్ ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మీకిష్టమైన హీరోయిన్ ఎవరని అడగగా అందరూ రామ్ చరణ్ తో నటించిన హీరోయిన్స్ లో ఎవరో ఒకరి పేరు చెబుతాడులే అనుకుంటే… తనకి ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అంటే ఇష్టమని చెప్పి అందరికి షాకిచ్చాడు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మీకు ఫెవరెట్ హీరోయిన్ ఎవరు.. ఏ హీరోయిన్ డాన్స్ అంటే ఇష్టము అని అడిగితె.. నాకు సాయి పల్లవి డాన్స్ అన్నా ఆమె నటన అన్నా చాలా ఇష్టమని చెప్పాడు.
స్టార్ హీరోస్ అందరు సాయిపల్లవిని మెచ్చుకుంటున్నప్పటికి స్టార్స్ సరసన అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతానికి యంగ్ హీరోలతోనే సరిపెట్టుకుంటుంది. గతంలో మహేష్ బాబు సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్ వచ్చినప్పటికీ… లిప్ లాక్ కిస్ ఉంటుంది అనే కారణంగా సాయి పల్లవి ఆ ఛాన్స్ వదులుకుంది అని అన్నారు. ఇక రామ్ చరణ్ మనసులో సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్ గా ఉంది అంటే.. రాబోయే కాలంలో చరణ్ ఏమైనా సాయి పల్లవికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ లో గుసగుస లాడుతున్నారు.