మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. కాగా శనివారం స్వగృహంలో లో నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యాడు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మంగళ స్నానం చేయించి పెళ్ళిబుకుతురిగా రెడి చేశారు. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ఉదయ్ విలాస్ లో ఈ పెళ్లి జరగబోతుంది. గత కొన్ని రోజులుగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.