డిసెంబర్ 24న న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్‌తో పాటు వరుణ్ తేజ్ గని సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటుందట. జనవరి, ఫిబ్రవరిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండడంతో మార్చికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు గని మేకర్స్.
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదల అయిన లుక్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.