మెగా ఫ్యామిలీలో ముందుగా అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చేస్తే, ఆ తర్వాత ఈ లిస్ట్ లో చేరుతూ రామ్ చరణ్ తేజ్ అండ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు కూడా సిక్స్ ప్యాక్ చేసి మెగా అభిమానులని మెప్పించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా చేరడానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్, లవ్, నెగటివ్ టచ్, ప్రయోగాలు ఇలా జానర్ తో సంబంధం లేకుండా కథ నచ్చితే చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, నెక్స్ట్ సినిమాలో కిక్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ మూవీతో కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. బాక్సర్ గా కనిపించడానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ తేజ్, సిక్స్ ప్యాక్ కూడా చూపించడానికి సిద్దమవుతున్నాడని సమాచారం. ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే వరుణ్ తేజ్ లాంటి పర్సనాలిటీ రాక్ ఫిట్ గా 6 ప్యాక్ తో కనిపిస్తే, థియేటర్స్ లో విజిల్స్ పడడం ఖాయం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పటికే తొలిప్రేమ టైటిల్ తో హిట్ కొట్టిన వరుణ్ తేజ్, కిక్ బాక్సింగ్ సినిమా పవన్ తమ్ముడు మూవీని గుర్తు చేసేలా ఉంటుందని సమాచారం.