ఆచార్య సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, సంక్రాంతి తర్వాత కానీ షూటింగ్ కు చిరంజీవి హజరుకారని ఫిలింనగర్ లో జోరుగా చర్చసాగింది. దీంతో ఆచార్య రిలీజ్ సమ్మర్ నుండి వాయిదా పడిందని, దసరాకే ఆచార్య వస్తారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే చిరంజీవి కీలక సన్నివేశాల చిత్రీకరణకు హజరయ్యారని తెలుస్తోంది. కీలక షెడ్యూల్ పూర్తయిందని, మరో షెడ్యూల్ సోమవారం నుండి మొదలుకాబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ నెలాఖరు వరకు షూటింగ్ ఉందని సమాచారం. రాంచరణ్ జనవరి నుండి సెట్స్ కు రానుండగా, మార్చి నెలాఖరు వరకు షూటింగ్ పూర్తి చేయాలని గోల్ పెట్టుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ఆచార్యను మే 7న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.