సినీరంగంలో పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు కరోనా సమయంలో ఏర్పాటైంది సీసీసీ. కరోనా లాక్ డౌన్ సమయంలో సీసీసీ మూడు నెలల పాటు నిత్యావసర వస్తువుల్ని అందించింది. ఇప్పుడు మళ్లీ సీసీసీని యాక్టివ్ చేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.
సీసీసీ ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్స్ వేయించే ఆలోచన ఉందని, త్వరలో అందుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపడతామని చిరంజీవి హామీ ఇచ్చారు. సీసీసీ ఫండ్ లో కొంత మొత్తం ఇంకా మిగిలే ఉందని, దాన్ని ఉపయోగించి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామన్నారు.
వ్యాక్సిన్ పై కార్మికుల్లో గందరగోళం ఉంది. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే ఆలోచన కూడా ఉంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి తెలిపారు.
వైల్డ్ డాగ్ సినిమాకు సంబంధించి అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న చిరు ఈ విషయాన్ని ప్రస్తావించారు.