బిగ్ బాస్-4 చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ఇటు కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. మరోవైపు ఫైనల్ కు చీఫ్ గెస్ట్ ఎవరు అన్న చర్చ కూడా సాగుతుండగా… మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు ఇటీవలే చిరును సంప్రదించగా… ఆయన ఒకే చెప్పారని సమాచారం. బిగ్ బాస్-3 ఫైనల్ కు కూడా చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా, వరుసగా రెండోసారి ఆయనే రాబోతున్నారు. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో ఉన్న చిరంజీవి… శుక్రవారం సాయంత్రం బిగ్ బాస్ ఫైనల్ షూటింగ్ కు అటెండ్ కాబోతున్నారు.