సైరా సక్సెస్‌తో జోష్‌లో ఉన్న మెగా అభిమానులకు మరింత జోష్ పెంచే వార్త చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. దసరా కానుకగా తీపి కబురు అందిస్తూ, కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. కొరటాల శివ డైరెక్షన్‌లో చిరంజీవి 152వ సినిమా ప్రారంభం అయింది. ఈ కార్యకరం లో చిరంజీవి, సురేఖ, చిరంజీవి తల్లి అంజనీదేవి, రామ్‌చరణ్, సుస్మిత పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశాన్ని చిరంజీవి సతీమణి క్లాప్ కొట్టి ప్రారంభించారు. మ్యాట్నీ ఎంటర్టయిన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ ఈ సినిమా నిర్మిస్తోంది.