టాలీవుడ్ లో ఇప్పుడు సమ్మర్ రిలీజ్ సినిమాల రేస్ ఊపందుకుంది. ఎప్పటి నుండో వెయిటింగ్ మోడ్ లో ఉన్న సినిమాలన్నీ సమ్మర్ కు ముస్తాబవుతున్నాయి. ఈ సమ్మర్ లో చాలా రోజుల తర్వాత వారానికో కొత్త సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది.
వెంకీ నటిస్తున్న నారప్ప మే 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ డేట్ ఫిక్స్ చేసిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్యను మే 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో వెంకీ, నిర్మాత సురేష్ బాబులు షాక్ కు గురయ్యారు.
నిజానికి మే 7న ఆచార్య రిలీజ్ ఉంటుందని ముందుగా అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో రంజాన్ హాలిడే కోసం మే 13న రిలీజ్ చేయాలని కొరటాల ప్లాన్ మార్చారు. దీంతో సురేష్ బాబు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. నారప్ప రిలీజ్ డేట్ ను మార్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.