సినిమా హీరోలపై ఫ్యాన్స్ తమ అభిమానాన్ని రకరకాలు గా చూపిస్తారు. అదే ఆ హీరోకి సంబంధించి బర్త్ డే లాంటివి వస్తే ఆ అభిమానం ఉత్సాహం మరింత ఎక్కువగా మారుతాయి. అప్పట్లో తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తే భోజనాలు, కట్ అవుట్ లు వంటివి పెట్టేవాళ్ళు కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియాలోనే మొత్తం నడిపిస్తున్నారు. హాష్ టాగ్ లతో ట్రెండ్ చెయ్యటం వంటివి చేస్తున్నారు.

అయితే త్వరలో మెగాస్టార్ బర్త్ డే ఉంది. దీనితో అభిమానులు కొత్తగా ఏమైనా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.హీరో పుట్టిన రోజు అనగా కామన్ డీపీ రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో జరుగుతున్నప్పటికీ చిరంజీవి పుట్టిన రోజుకు దీనికి కాస్త డెవలప్ చేసి కామన్ మోషన్ పోస్టర్ తీసుకొస్తారట. దీని కోసం చిరంజీవి పీఆర్ టీమ్ ఓ వీడియోను రూపొందించిందట. చిరంజీవి పుట్టిన రోజుకు వారం ముందు అంటే ఆగస్టు 15న దీనిని విడుదల చేస్తారని సమాచారం. ఇండస్ట్రీలోని 65 మంది ప్రముఖులతో దీనిని సోషల్ మీడియాలో పెట్టించాలని చూస్తున్నారట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.