హైదరాబాద్: మెగాస్టార్ లక్కీ స్టార్..! గతంలో నెల్లూరు పొలాల్లో ఎయిర్‌బస్ ఎమర్జెన్సీ లాండింగ్‌లో సేఫ్..! సైరా ప్రమోషన్స్ టూర్‌లో బిగ్ ఎస్కేప్…! నిజంగా ఇది మిరకిల్..! లక్ ఉంటే ఎంత పెను ప్రమాదమైనా తప్పించుకోవచ్చని అనడానికి ఈ రెండు విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిదర్శనం.
1993 నవంబర్ 15- చెన్నయ్- హైదరాబాద్ ఎయిర్‌బస్ వాతావరణం అనుకూలించక హైదరాబాద్‌లో ల్యాండ్ కాలేదు. తిరిగి చెన్నయ్ వస్తుండగా సాంకేతిక సమస్య వచ్చింది. పైలట్ చాకచక్యంగా నెల్లూరు పొలాల్లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న చిరంజీవితోపాటు, ఎందరో సినీ ప్రముఖులు సేఫ్‌గా బయటపడ్డారు.
2019 ఆగస్టు 31 – ముంబై-హైదరాబాద్ విమానం బయలుదేరింది. సైరా మూవీ ప్రమోషన్‌కు వెళ్ళిన చిరంజీవితోపాటు 120 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. బయలుదేరిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. వెంటనే పైలెట్ విమానాన్ని వెనక్కి మళ్ళించాడు. సేఫ్‌గా ల్యాండ్ చేశారు.
ఈ రెండు ఘటనలు…యాదృచ్చికమే అయినా చిరంజీవికి జీవితంలో ఇవి మరచిపోలేని సంఘటనలు. నిజ జీవితంలో మెగా ఎస్కేప్‌కు హిస్టరీ పాయింట్స్..!!