మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీల లిస్టులో ఉన్న క్రేజీ ప్రాజెక్టు లూసీఫర్ తెలుగు రీమేక్. ఇటీవలే ఆచార్య మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న చిరు.. లూసీఫర్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీలో చిరు లుక్ ఎలా ఉంటుంది, టైటిల్ ఏమిటన్న విషయాలపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే వారి ఎదురుచూపులకు త్వరలోనే ఫలితం దక్కబోతోంది.
ఆగస్టు 22న ( ఆదివారం) మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కావడంతో.. దానికి ముందు రోజు అంటే శనివారం సాయంత్రం 5.04 గంటలకు సుప్రీమ్ రివీల్ ఉంటుందని ఈ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే శనివారం రాబోయేది ఫస్ట్ లుక్ అవుతుందా లేదా టైటిల్ ప్రకటిస్తారా అన్నది.. సస్పెన్స్‌గా మారింది. అయితే ఏ అప్డేట్ అయినా చిరు అభిమానులకు పండగే కానుంది.