మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ధర్మస్థలి తలుపులు జనవరి 29 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని తెలుపుతూ టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి మెగా అభిమానుల్లో మంచి జోష్ నింపారు చిత్ర యూనిట్.
అయితే ఇటువంటి సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ పోస్టర్ ను షేర్ చేశాడు. ఈ మూవీకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు వరుణ్ పోస్ట్ చేసిన పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పేశాడు. మణిశర్మ కంపోజ్ చేసిన బిజిఎం, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఉండబోతుందని ఆ విషయం ఈ మెగా హీరో పోస్ట్ చేసిన పోస్ట్ ద్వారా తెలిసిపోయింది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
#AcharyaTeaser@KChiruTweets @AlwaysRamCharan https://t.co/ullSqm4bt1 pic.twitter.com/0rOCe3Pu0j
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 27, 2021