మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించారు.
ఈ సినిమా తో పాటు మరో మూడు సినిమాలను చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందులో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ ఒకటి. రెండవది మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్, మూడవది బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా154.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఉమెన్స్ డే ఈ సందర్భంగా మెగా 154 చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ నేమ్ ను అనౌన్స్ చేశాడు.
ఆమె మరెవరో కాదు శృతిహాసన్. ఇదే విషయాన్ని చెబుతూ శృతి హాసన్ తో దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఆమెకు మెగా154 సినిమా బోర్డ్ లోకి వెల్కమ్ చెబుతూ ట్వీట్ చేశాడు.
On this Women's Day, delighted to Welcome you on board @shrutihaasan
You bring Woman Power to #Mega154 @MythriOfficial @dirbobby #GKMohan @ThisIsDSP pic.twitter.com/xYMaiQPpni— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2022
Advertisements