(రవీంద్రనాథ్ శ్రీరాజ్)
“మీ దుంపతెగ. ఇదేం మాయరోగంరా. ఆయనేమన్నా తిండి పెడతాడా ఉద్యోగమిస్తాడా. ఎందుకురా ఇంత పిచ్చి. ఈ శ్రద్ధేదో కాస్త పుస్తకాల మీద పెడితే కలెక్టరేమో కానీ కనీసం తాసిల్దారైనా అయ్యుండేవాడివి కదరా”
మొదటిరోజు బాస్ సినిమా బెనిఫిట్ షో చూడాలని తెల్లవారుజామునే లేచి గబగబా పళ్ళు తోముకుని ఎవరి చెప్పులు కాళ్లకు తొడుక్కుంటున్నానో చూసుకోకుండా మరీ పరుగులు పెడుతున్న నన్ను చూసి ప్రతిసారి అమ్మ వినిపించే స్తోత్రం ఇదే.
అలా తిడితే నేనేదో మారిపోతాననుకోవడం తన పొరపాటు. ఇలా జరిగినప్పుడల్లా ఒక చెవి ద్వారా ఫిల్టర్ లేకుండా ఈ మెసేజంతా బయటికి పంపడం నాకలవాటు. మాథ్స్ సబ్జెక్ట్ లో నా పర్సెంటేజీ ఇలాంటి టైంలో అమ్మ ఇచ్చే తిట్ల క్యారెజీ ఎప్పుడూ మారేవి కావు.
అవును. నిజమే. మనకు పరిచయమే లేని ఒక వ్యక్తి పట్ల, జీవితంలో ఒక్కసారైనా కలుస్తామో లేదో గ్యారంటీ లేని ఓ మనిషి పట్ల ఇంత ఆరాధనాభావం ఎందుకు కలుగుతోంది ?
ఎప్పటికీ నిజం కాలేని ఓ ఊహా ప్రపంచాన్ని తెల్లని తెరపై చూపించే ఓ నటుడి పట్ల ఎందుకు ఇష్టం కలుగుతోంది ?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేంత పరిణితి లేని వయసులోనే సినిమా మీద ప్రేమ మొదలైంది. తర్వాత ఆ స్పృహ కలిగినా బదులు అక్కర్లేనంత అభిమానం హిమాలయ శిఖరమంత ఎత్తుకు ఎదిగినప్పుడు ఇక వాదనకు చోటేముంటుంది. అందుకే ఆయన మీద ప్రేమ ఎంతో చెప్పే కొలమానం కావాలంటే అది ప్రపంచంలోనే కాదు అంతరిక్షంలో వెతికినా దొరకదు. ఇప్పటికీ మా అమ్మ తను నన్ను అడిగిన ప్రశ్నలకు బదులు దొరక్క వెతుకుతూనే ఉంది. ఆ అన్వేషణ ఆగదని మా ఇద్దరికీ తెలిసినా ఈ తీపి సంఘర్షణ ఉండాల్సిందే.
నాకు ఊహ తెలిశాక నాలుగు పెద్ద గోడల మధ్య వందల జనం పోగై ఈలలు కేకలు వేసుకుంటూ ఆనందం మునిగితేలతారని నాకు పరిచయం చేసింది ఆయన సినిమానే.
కాళ్ళు కదిపితే అదే డాన్సనుకునే నా భ్రమలను బద్దలుకొడుతూ లయబద్దంగా ఒంటిని స్ప్రింగ్ గా తిప్పడమంటే ఏంటో చేసి చూపించి నా బాత్ రూమ్ మొదలుకుని వాక్ మెన్ దాకా ప్రతి చోటా ఆయనే ఉండేలా చేసింది వాటిలోని పాటలే.
బ్లాక్ అండ్ వైట్ టీవీలో కలర్లు ఎందుకు ఉండవో తెలియని అమాయకపు బాల్యంలోనే వెండితెర పులకింతను పరిచయం చేసి నా మధ్యతరగతి జ్ఞాపకాలను ఖరీదుగా మార్చింది ఆయన పాత్రలే.
చెప్పలేనంత ఉంది ….. ఇక్కడే మొత్తం రాయలేనంత ఉంది.
ఏడాదికోసారి ఇలా అక్షరాలా రూపంలో ఏదో ఒకటి పంచుకుంటూనే ఉన్నా అర్రే ఇంకా అది మిస్ అయ్యానే అని ఫీలయ్యేంత భావం నిత్యం కదలాడుతూనే ఉంది. అయినా ఆయనంటే ఉన్న అభిమానం వెన్నంటే ఉన్న మాయాజాలం నాకు స్ఫూర్తినిచ్చాయే తప్ప పక్కదారి పట్టి నన్ను లక్ష్యం లేని వాడిగా మార్చలేదు.
అందుకే ఆ సమ్మోహన శక్తి గురించి ఇంతకు మించి రాసే శక్తి లేక ఆపేస్తున్నా .
స్వాతంత్ర సమరయోధుడిగా 64 ఏళ్ళ నవ యవ్వన యుద్ధవీరుడిని చూసేందుకు తహతహలాడుతున్నా.
ఇంతకీ ఆయన ఆయన అంటున్నానే కానీ పేరు చెప్పలేదు కదూ . ఆయనేనండీ “చిరంజీవి”
చిరంజీవి సుఖీభవ అనే దీవెన మెగాస్టార్ వచ్చాకే పుట్టిందన్న అమాయకత్వపు చెరలో నుంచి ఇంకా బయటపడలేని ఇష్టమైన అపరిపక్వతను మనసారా ఆస్వాదిస్తున్న…
-ఓ సగటు అభిమాని
Happy Happy Birthday to the Coolest, most Progressive & supportive Father in Law ❤️?. #megastarchiranjeevi
proud #konidela
Check out : 3 generations of Konidela Kodalu ?? #HBDEvergreenMegaStar pic.twitter.com/qt1GX14a4t— Upasana Konidela (@upasanakonidela) August 22, 2019
Wishing our Dearest 1 & Only #MEGASTAR #Annayya #Chiranjeevi Sir a SUPER DUPER MUSICAL HAPPY BIRTHDAY !!????❤️????????
Love frm my Whole Team❤️?#SyeRaaNarasimhaReddy #HBDMegaStarChiranjeevi @KonidelaPro #RamCharan @upasanakonidela @IAmVarunTej @IamSaiDharamTej pic.twitter.com/v5jNjLc7oB
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 22, 2019
#HBDMegaStarChiranjeevi , you deserve loads of happiness and more , have a good one❤️❤️❤️❤️ pic.twitter.com/vFsGnJw9Az
— Radikaa Sarathkumar (@realradikaa) August 22, 2019
Happy birthday to my hero, my confidante, my guru and to my dearest Dad. You are a never-ending source of inspiration! Love you dad! #HBDMegastarChiranjeevi pic.twitter.com/7TLOFUHZOv
— sushmita konidela (@sushkonidela) August 22, 2019
Happy Birthday #Chiranjeevi. Warm memories of moments spent with you flicker in my heart. Thank you for touching my life . ??? https://t.co/BHBkJoI4u1
— Mahesh Bhatt (@MaheshNBhatt) August 22, 2019
Maaku Prathi samvatsaram eeroju pandage #prathirojupandage #HappyBirthdayMegastar #SyeRaaNarasimhaReddy #MegaStarBirthday #MegastarBirthdayCelebrations pic.twitter.com/EXW0meBkEO
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 22, 2019