కైకాల సత్యనారాయణ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో చిత్రాల్లో ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన అందరికీ సుపరిచితమే. కాగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కైకాల ప్రస్తుతం బెడ్‌పైనే చికిత్స తీసుకుంటున్నారు. దాదాపుగా కదలలేని స్థితిలో ఉన్న ఆయన వద్దకు చిరు స్వయంగా వెళ్లారు.
ఈ సందర్భంగా తన వెంట బర్త్ డే కేక్ తీసుకెళ్లిన చిరు… బెడ్‌పై దానిని పెట్టి కైకాలతో దానిని కట్ చేయించారు. ఈ సందర్భంగా కైకాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపానని, అది తనకు ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని చిరు పేర్కొన్నారు.
భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నానంటూ చిరు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కైకాల కేక్ కట్ చేస్తున్న ఫొటోలను చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022
Advertisements