మెహర్ రమేష్…టాలీవుడ్ అగ్రహీరోలకు భారీ డిజాస్టర్లను ఇచ్చిన దర్శకుడు. వరుస ఫ్లాప్ లతో కెరీర్ ను సాగిస్తున్న మెహర్ రమేష్ కు ఏ హీరో కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. దీనితో అవకాశం కోసం అక్కడా ఇక్కడా తిరుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యామిలీ కి , ఇటు మెగా ఫ్యామిలీ కి మంచి సన్నిహితుడు గా ఉంటున్న రమేష్ , వారి నుండి ఒక్క ఛాన్స్ అయినా వస్తే బాగుండు అని వారి చుట్టూ తిరుగుతున్నాడు. కాగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి రమేష్ కు ఆఫర్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్, డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వచ్చిన వేదాలమ్ చిత్ర రీమేక్ బాధ్యతలు మెహర్ రమేష్‌కు చిరు అప్పగించారట. ప్రస్తుతం తెలుగు నెటివిటీకి మెహర్ ఆ చిత్రాన్ని మార్చారట. త్వరలోనే పూర్తి స్ర్కిప్ట్ చిరుకు మెహర్ వినిపించనున్నాడని అంటున్నారు.