వెంకీమామతో హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న డైరెక్టర్ బాబీపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకీమామ సక్సెస్ మీట్‌కు వచ్చిన చిరు… తనపై కోపం తెచ్చుకున్నారని స్వయంగా బాబీయే వెల్లడించారు.
అయితే… విషయం ఎంటి, ఎందుకు కోపం తెచ్చుకున్నారు, జనరల్‌గా ఎవరినీ ఏమీ అనని చిరుపై బాబీ ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. బాబీ ఇలా మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యపోయారు.
అయితే… డైరెక్టర్ బాబీ అసలు విషయం చెప్పాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంకీమామ సినిమాకు మంచి హిట్ టాక్ వస్తుండటతో… చిరంజీవి కూడా సినిమా చూశారట. అయితే… సినిమాలో కాశ్మీర్ మంచు కొండల్లో వెంకీపై బుల్లెట్ల వర్షం కురిసే సీన్‌ను చూస్తూ… వెంకటేష్‌ను బాగా ఇబ్బందిపెట్టావ్, అది కష్టమైన సీన్ అంటూ బాబీని సున్నితంగా మందలించారని బాబీయే స్వయంగా వెల్లడించారు. వెంకీమామ సక్సెస్ మీట్‌లో బాబీ ఈ విషయాలు వెల్లడించారు.