కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మే లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
అయితే ఈ చిత్రం రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటికి మొన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.