చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్. తెలుగు తెలుగు తెరకు కమర్షియల్ స్ట్రెంత్ పెంచిన హీరో.యాక్షన్ ,సెంటి మెంట్,కామెడీ ,డ్యాన్స్..ఏదైనా సునాయాసంగా పండించగల పండితుడు చిరంజీవి. ఒకప్పటి తన పునాదిరాళ్ళు సినిమా నుంచి నేటి ‘వాల్తేరువీరయ్య’ సినిమా దాకా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
దర్శకుల బాణిని అభిమానుల వాణిని వంటబట్టించుకున్న నటుడాయాన. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా స్వయంకృషితో, క్రమశిక్షణతో ఒక్కోమెట్టూ ఎక్కుతూ మెగాస్టార్ ఎదిగాడు. మనసున్న మనిషిగా ఒదిగాడు.
ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. కెరీర్ మొదలు పెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఒడిసిపట్టాడు. ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. మరెన్నో రికార్డులను సృష్టించాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన అనంతరం ఆయనఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సినీ పరిశ్రమలోకి ఎంటరయ్యారు.
ఆయన తమ్ముళ్ళు నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత ఆయన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అందరికీ గుర్తొస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మెగాస్టార్ తండ్రి కొణిదెల వెంకట్రావు కూడా నటన పై ఉన్న మక్కువతో సినిమాలలో నటించారు.
అయితే మెగాస్టార్ తండ్రి కూడా నటించారని ఎక్కువగా తెలియదు. ఇంతకి ఆయన ఏ సినిమాలో నటించాడంటే బాపు గారి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా చేసిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ అనే చిత్రంలో నటించారు.
అంతేకాకుండా చిరంజీవి సినిమాల్లోకి రాకముందే 1969 లో వచ్చిన జగత్ కిలాడీలు అనే మూవీలో కూడా నటించారు. ఈ సినిమా తరువాత ఆయనకు వరుసగా నటించే అవకాశాలు వచ్చినా, నటుడిగా కొనసాగలేకపోయారు.
ఎందుకంటే వెంకట్రావు వృత్తి కానిస్టేబుల్ కావడం, కుటుంబ బాధ్యతల కోసం, తనకెంతో ఇష్టమైన సిని రంగాన్ని వదిలిపెట్టి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను నెరవేర్చారు.
ఇక తండ్రిలాగానే ఆయన కుమారుడు చిరంజీవి నటన పై ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అంచలంచలుగా ఎదిగి, టాలీవుడ్ లో అగ్ర హీరోగా తండ్రిని మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం విశేషం.