ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) ముగింపు ఉత్సవాల్లో మోగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి సందడి చేశారు. చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు వరించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి ఆయన భార్యతో కలిసి గోవాకు వెళ్లారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న చిరు మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు ప్రధానం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లడించారు.
ప్రత్యేకంగా నిలిచే అవార్డుల్లో ఇదొకటి. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నట్లు చిరు చెప్పారు. సరైన సమయంలోనే నాకు అవార్డు ఇచ్చారని భావిస్తున్నా. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. సినీ పరిశ్రమలోకి రాకముందు నేను కొణిదెల శివశంకర ప్రసాద్. ఇప్పుడు నా అభిమానుల వల్ల మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగానని తెలిపారు.
రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు గ్యాప్ వచ్చిందన్నారు. పాలిటిక్స్ లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైందన్నారు. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే అనుమానం ఉండేది. కానీ ఎప్పటిలానే నాపై ప్రేమ చూపించారు. వారి ప్రేమకు నేను దాసుణ్ణి. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటానని పేర్కొన్నారు. గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఓ సారి ఇక్కడకు వచ్చా. దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని చాలా బాధపడ్డానన్నారు.
Megastar @KChiruTweets receives the Indian Film Personality of the Year award#IFFI53 #IFFI #AnythingForFilms #IFFI53Goa #IFFIGoa pic.twitter.com/8x9F5oyCob
— PIB India (@PIB_India) November 28, 2022
సినిమా ఎక్కడైనా తీయొచ్చు. కానీ అది భారతీయ సినిమా అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి.. భారతీయ సినిమా అనే రోజు వచ్చిందన్నారు. నాకు యంగ్ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ అన్నారు చిరంజీవి. వాళ్లకు ఇప్పుడు కష్ట కాలమే అంటూ సరదాగా కామెంట్స్ చేశారు మెగాస్టార్. కాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో బాలకృష్ణ నటించిన అఖండ, అడవి శేష్ మేజర్, సినిమా బండి, ఖుదీరాం బోస్ మూవీస్ పనోరమా కేటగిరిలో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యాయి.
Megastar @KChiruTweets receives the Indian Film Personality of the Year award
Let’s watch the beautiful journey of 𝓣𝓱𝓮 #𝓒𝓱𝓲𝓻𝓪𝓷𝓳𝓮𝓮𝓿𝓲📽️#IFFI53 #IFFI #AnythingForFilms #IFFI53Goa #IFFIGoa pic.twitter.com/wRRgUa8Zjc
— PIB India (@PIB_India) November 28, 2022