అభిమానులకు మెగాస్టార్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు. మెగా అభిమానులందరికీ చిరు ఓ వినూత్న పథకాన్ని తీసుకరాబోతున్నారు. మెగా అభిమానులందరికీ చిరు ప్రమాద భీమా చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మెగా అభిమాన సంఘాలన్నీ అభిమానుల వివరాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ అభిమానం సంఘం అంటే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు క్రియాశీలకంగా లేని అభిమాన సంఘాలకు, అభిమానులను ఓకే చోటుకు చేర్చి… అభిమాన సంఘం పవర్ ఎంటో చూపించారు మెగాస్టార్. తన బ్లడ్ బ్యాంక్‌తో మెగా అభిమానుల సహాయం తీసుకోని నిలబడ్డాడు. ఇప్పుడు వారందరికీ అండగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అభిమానులు ఎలాంటి ప్రమాదంలో మరణించిన, పూర్తిగా అంగవైకల్యం పొందినా… కుటంబ పోషణ ఇబ్బంది కాకుండా ఎంతో కొంత ఆర్థిక సహాయం అందేలా గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేశారని ఇండస్ట్రీ టాక్.