మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది . కాగా ఇటీవల చిరంజీవి గుండు తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ గెటప్ లోకి చిరు ఎందుకు మారారు అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. తాజాగా చిరంజీవి తన లుక్ వెనకున్న సీక్రెట్‌ను రివీల్ చేశారు.
మెగాస్టార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు అర్బన్ మాంక్ లుక్‌లోకి తాను ఎలా మారాననే విషయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. మ్యాజిక్ ఆఫ్ సినిమాకు సెల్యూట్ అని చిరు వీడియోతో పాటు మెసేజ్ కూడా షేర్ చేశారు.