ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి… కరోనా వైరస్ పరిస్థితులు చక్కబడే వరకు షూటింగ్ కు దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ పూర్తికాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ రీమేక్ చేస్తారని అంతా భావించినా… ఆ ప్రాజెక్టు సైడ్ అయిపోయింది.
తాజాగా మరో రీమేక్ మూవీకి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేదలం మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న అనిల్ సుంకర ఏకే ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా చేయనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ కు ఓకే చెప్పిన మెగాస్టార్ కు దర్శకుడు మొహర్ రమేష్ త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ వినిపించనున్నారని తెలుస్తోంది. ఆచార్య మూవీ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.