మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాన్ని శివనామస్మరణతో మారుమోగాయి. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరం చేస్తూ భక్తులు పారవశ్యంలో మునిగితేలారు. కరోనా నిబంధనల కారణంగా చాలా మంది ఆలయాలకు వెళ్లకుండా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వారి ఇంట్లో శివుడికి పూజభిషేకాలు నిర్వహించారు.
మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఇంట్లో చేసిన పూజాభిషేకానికి సంబంధించిన వీడియో చిరంజీవి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోతో పాటు శివుడిని స్తుతిస్తూ కొన్ని కామెంట్లు పెట్టారు. సంప్రదాయ దుస్తుల మెరిసిపోతూ చిరంజీవి దంపతులు కలిసి పూజ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మంజునాథుడు భక్తుడి రూపంలో పూజలు చేయించుకున్నట్టుగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మహాప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాధం
అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.
ఈ శివరాత్రి నాడు మహాశివుడుకి పూజాభిషేకం. 🙏🙏 pic.twitter.com/XUh11wLQKo— Chiranjeevi Konidela (@KChiruTweets) March 11, 2021