మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలు కూడా ఉదయపూర్ లోని కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. కాగా సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో నిహారిక చైతన్య చిరంజీవి సినిమా పాటలకు డాన్సులు వేస్తూ సందడి చేశారు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో చిన్నప్పుడు నిహారికతో దిగిన అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారిక ని చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభ తరుణంలో ముందస్తుగా కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు, ఆశీస్సులు.. గాడ్ బ్లెస్ యు అంటూ ట్వీట్ చేశారు. ఇక బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడుముళ్ళు వేయబోతున్న సంగతి తెలిసిందే.
మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! #NisChayWedding @IamNiharikaK pic.twitter.com/eLLPcZcYZV
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2020
Advertisements