హైదరాబాద్: సున్నితమైన మనసున్న వారికి రాజకీయాలు సరిపడవని చిరంజీవి చెప్పారు. నేటి కాలంలో డబ్బుతో రాజకీయాలు నడుస్తున్నాయని, అందువల్లనే సొంత నియోజకవర్గంలో తాను ఓడిపోయానని అన్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అందుకే ఓడిపోయారని వివరించారు. రాజకీయాల్లో ఉండాలని అనుకుంటే ఎన్నో అవమానాలు, అవరోధాలు, పరాజయాలను ఎదుర్కోవాలని అన్నారు. వీటికి సిద్ధపడితే కమల్, రజనీకాంత్ రాజకీయాల్లో నిలదొక్కుకుంటారని చెప్పారు. తమిళ మ్యాగజైన్ ఆనందవికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇదే విషయం తాను రజనీకాంత్, కమలహాసన్‌కు కూడా చెప్పానని అన్నారు.