మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆర్థిక సహాయం చేశాడు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి బజ్జీలు వేసుకుంటూ బతుకు జట్కా బండిని నెట్టుకొస్తున్నాడు. అయితే శేఖర్ మొదటి నుంచి చిరంజీవి కి వీరాభిమాని కాగా శేఖర్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందులో పెద్ద అమ్మాయి వర్ష పెళ్లి ఈ నెల 19న జరగనుంది.
అయితే శేఖర్ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకున్న చిరంజీవి ఆయనకు లక్ష రూపాయల సహాయం చేశారు. అందుకు సంబంధించిన లక్ష రూపాయల చెక్కును ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందించారు. ఇక ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ రక్తసంబంధీకులు కూడా చెయ్యని సహాయాన్ని చిరంజీవి చేశారని, కష్టంలో ఆదుకున్న చిరంజీవిని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.