నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే మరోవైపు అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అంటూ టాక్ షో కూడా చేస్తున్నాడు. నిజానికి బాలయ్య టాక్ షో అనగానే చాలా మంది షాక్ అయ్యారు. బాలయ్య టాక్ షో చేయగలుగుతాడా అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ బాలయ్య అదరగొట్టేశాడు.
ఇప్పటికే ఈ టాక్ షో కు చాలా మంది స్టార్స్ వచ్చారు. మోహన్ బాబు, నాని, అనిల్ రావిపూడి, రవితేజ, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా చాలా మంది వచ్చారు.
ఇక మహేష్ బాబు ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం కానుంది. ఈ సీజన్ కు ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఇదిలా ఉండగా అండ్ స్టాప్ బుల్ సీజన్ 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.
సెకండ్ సీజన్ కు మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారట. ఇదే విషయాన్ని రైటర్ బీవీఎస్ రవి అలియాస్ మచ్చా రవి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్‌గా అడిగామని ఆయన కూడా వస్తానని చెప్పారని అన్నారు.
ఫస్ట్ సీజన్‌కి మెగాస్టార్ రాకపోవడానికి రాజకీయ, సామాజిక కోణాల్లో కారణాలు లేవని గాడ్ ఫాదర్, భోళా శంకర్, ఆచార్య డబ్బింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల చిరు రాలేదని అన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం చిరు చుట్టూ రాజకీయం తిరుగుతుందని అందుకే రాలేకపోయారని అన్నారు.