• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ప్రముఖ అమెరికా షోలో చెర్రీ.. ఆనందంలో చిరు..!

ప్రముఖ అమెరికా షోలో చెర్రీ.. ఆనందంలో చిరు..!

Last Updated: February 23, 2023 at 2:38 pm

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాపులర్ అమెరికన్ షోలో పాల్గొన్న ఫస్ట్ యాక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసాడు చెర్రీ. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో రామ్ చరణ్ పాపులారిటీ ఖండాంతరాలను తాకింది. అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో చెర్రీ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీగా మారాడు. ఈ క్రమంలోనే అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో రామ్ చరణ్ గెస్ట్ గా కనిపించాడు.

Image

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ వేగస్‌ లో ఉన్నాడు.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్ ‌కు నామినేట్‌ అయిన నేపథ్యంలో అక్కడ ఆయన పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే ప్రముఖ టెలివిజన్‌ టాక్‌ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ నుంచి చెర్రీకి పిలుపు వచ్చింది. లేటెస్ట్ గా చరణ్ ఈ షోలో పాల్గొన్నాడు. ముగ్గురు యాంకర్లు ఆయనతో చిట్‌ చాట్‌ చేశారు.

చరణ్ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రధానంగా స్నేహం, అన్నదమ్ముల నేపథ్యంలో సాగే చిత్రం. మా డైరెక్టర్ రాజమౌళి గొప్ప రచనల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. ఆయన్ని మేమంతా ఇండియన్‌ స్పీల్‌ బర్గ్‌ అని పిలుస్తామని చెప్పాడు. ఆ అంకితభావమే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చేలా చేసింది. ‘నాటు నాటు’ పాటను ఆస్కార్‌ నామినేషన్‌ వరకూ తీసుకెళ్లింది. 88 ఏళ్ల ఇండియన్‌ సినిమా హిస్టరీలో తొలిసారి ఓ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ కావడం మాకెంతో గర్వంగా ఉందన్నాడు చరణ్.

ఇంతలో మరో యాంకర్‌ త్వరలో తండ్రి కాబోతున్నారు ఆ ఫీలింగ్‌ ఎలా ఉందని ప్రశ్నించగా.. నేను చాలా హ్యాపీగా ఉన్నా.. అయితే ఇంతకు ముందు ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు.. కానీ ఇప్పుడు తప్పడం లేదు అని చెర్రీ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. అక్కడున్న యాంకర్స్‌ లో ఒక లేడి యాంకర్‌ గైనకాలజిస్ట్‌ కావడంతో మీ నంబర్‌ ఇవ్వండి ఉపాసన అమెరికా వచ్చినప్పుడు కలుస్తా.. అనగా చెర్రీ అందుబాటులో ఉండండి అంటూ నవ్వుతూ చెప్పాడు. అలాగే మీరు ఫాదర్ అవుతున్నారన్న విషయం మొదటగా ఎవరికి చెప్పారని అడగ్గా.. నేను తారక్ కి చెప్పానని, తనూ, నేనూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు చరణ్.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రముఖ అమెరికా టాక్ షోలో పాల్గొనడం పట్ల మెగాస్టార్ చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ షోకి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. ‘తెలుగు మూవీ, ఇండియా మూవీ గర్వించే మూమెంట్ ఇది. ఎంతో పేరున్న టెలివిజన్ టాక్ షోలో చరణ్ కనిపించాడు. విజనరీ డైరెక్టర్‌ రాజమౌళి మెదడుకి తట్టిన ఈ ఆలోచన అద్భుతం. ఆయన విజన్‌ తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ గా మారింది.

A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica

Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!

Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2023

Primary Sidebar

తాజా వార్తలు

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

కోదండరామ్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హరిత హారంలో పెంచిన 150 మొక్కలను నరికేశాడు…!

నగరంలో ఐపీఎల్ ఫీవర్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ప్రజలకు మరో షాక్.. సైలెంట్ గా చార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

ఫిల్మ్ నగర్

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో  సమ్మర్   వెకేషన్ కి   వెళ్ళిన  పవన్ ...!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

ktr-happy-to-rrr-oscar-winning-.jpg

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

దీపిక అటు ...రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్...!?

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap