మెగాస్టార్ చిరంజీవి మెగా ఈవెంట్ చేయబోతున్నారు. ఎనబై, తొంబైలలో గుర్తింపు పొందిన నటీనటులనుకు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏర్పాటు చేసిన క్లబ్‌లో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ ఇండస్ట్రీ నుంచి నటీనటులు ఉన్నారు. ఈ క్లబ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, భాను చందర్,అర్జున్, రజినీకాంత్, రాధికా, సుహాసిని, సుమలత, కుష్బూ సభ్యులుగా ఉన్నారు. కొత్తగా రీడిజైన్ చేసిన ఇంట్లో ఈ పార్టీ నిర్వహించాలని చిరంజీవి బావిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు వీళ్లంతా ఒకే వేదికపై మెరవబోతుండటంతో… ఈవెంట్ ఎప్పుడుంటుంతా అన్న ఆసక్తి పెరిగిపోతుంది.