తనపై ముందు పూలవర్షం కురిసిందని.. ఆ తర్వాత కోడిగుడ్లతో కొట్టారని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. లేటెస్ట్ గా సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో చిరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో స్మిత పలు ఆసక్తికర ప్రశ్నలను వేశారు. అందుకు చిరంజీవి కూడా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా సింగర్ స్మిత సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘నిజం విత్ స్మిత’ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఆమె రెడీ అయింది. ఈ షోలో సినీ, రాజకీయ నేలు ఎంతో మంది ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికర విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తోంది. తన టాక్ షోను మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభించబోతోంది. ఈ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నారు.
ఈ షోలో చిరుకు స్మిత ఎన్నో ప్రశ్నలను సంధించింది. కాలేజ్ డేస్ లో మీ ఫస్ట్ క్రష్? స్టార్ డమ్ అనేది కొంతమందికే.. ఆ స్థాయికి వెళ్లాలంటే ఎన్నో అవమానాలు, అనుమానాలు ఉంటాయి. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? వంటి ప్రశ్నలు చిరుకు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఘటనను చిరంజీవి చెప్పారు.
జగిత్యాలలో పర్యటించినప్పుడు ఫస్ట్ పైనుంచి తనపై పూలవర్షం కురిసిందని.. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే, కోడిగుడ్లతో కొట్టారని చెప్పారు. మళ్లీ ఒక వరప్రసాద్ మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉందంటారా? అనే ప్రశ్నను స్మిత వేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ నెల 10న విడుదల కాబోతోంది.
Also Read: సినిమాల్లోకి రాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటీ…?