ప్రధాని నరేంద్ర మోడీతో నటుడు మోహన్ బాబు భేటీ కావడంపై భిన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ పై అలకతోనే మోహన్ బాబు మోడీని కలిసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే మోహన్ బాబు వైసీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే ప్రధానితో భేటీలో పలు కీలక విషయాలను మోహన్ బాబు మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానితో మంచు ఫ్యామిలీ భేటీ వెనక మెగాస్టార్ ఉన్నారనే కొత్తవాదన తెరపైకి వచ్చింది. చిరంజీవి సూచనతోనే మోహన్ బాబు ప్రధానిని కలిశారని తెలుస్తోంది. ఏపీ రాజధానిగా విశాఖ తెలుగు చిత్ర పరిశ్రమకు సమ్మతమేనని చెప్పేందుకు మోడీని చిరు సూచనతో డైలాగ్ కింగ్ కలిసినట్లు సమాచారం.
ఇటీవల మా ఆర్టిస్ట్ ఆసోసియేషన్ లో జరిగిన విబేధాలపై చర్చించేందుకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఏపీ రాజధాని అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధానిగా విశాఖను ఏర్పాటు చేస్తే చిత్ర పరిశ్రమకు అన్ని విధాలా అనువుగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. దీంతో చిరు సూచనతో ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయాన్నీ మోహన్ బాబు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే మూడు రాజధానుల విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి జైకొట్టిన సంగతి తెలిసిందే.
కండోమ్ కంపెనీ బాస్‌గా జగపతి బాబు
మెగాస్టార్ సినిమాలో లేడీ అమితాబ్ ..?
Advertisements
96 రీమేక్ టైటిల్ జాను -ఫస్ట్ లుక్