వైసీపీలోకి చిరంజీవి?? - Tolivelugu

వైసీపీలోకి చిరంజీవి??

మెగాస్టార్ చిరంజీవి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా?
వైసీపీ తరుపున రాజ్యసభకు చిరు?
పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే వ్యూహంలో వైసీపీ?
బీజేపీకి తెలిసే జరుగుతోందా?

మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ తరుపున రాజ్యసభకు పంపించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ కీలక నేతలతో చిరంజీవి చర్చలు కూడా ముగిసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే చిరంజీవి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. జగన్ తో కూడా భేటీ అయిన విషయం తెలిసిందే.జగన్ నిర్ణయాలను చిరు సమర్ధించడం వెనుక రాజ్యసభ సీటే కారణమని టాక్.

చిరును రాజ్య సభకు పంపించి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.పవన్ బీజేపీ తో కలిసి నడుస్తున్నారు కాబట్టి చిరంజీవితో చెక్ పెట్టవచ్చునని వైసీపీ భావించి ఉండవచ్చు.పవన్ ఈ మధ్య కాలంలో జగన్ పై విరుచుకుపడుతున్నారు.భవిష్యత్తు రాజకీయ అవసరాలు దృష్టిలో ఉంచుకొని చిరంజీవిని రాజ్యసభకు పంపించే వ్యూహంలో వైసీపీ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలు బీజేపీ అధిష్టానానికి తెలియకుండా వైసీపీ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. బీజేపీనే చిరంజీవిని రాజ్యసభకు పంపమని జగన్ కు సూచించినట్టు తెలుస్తోంది.గతంలో కూడా చిరంజీవి బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ 9వ తేదీతో ఏపి నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు రిటైరవుతున్నారు. ఆ నాలుగు ఖాళీల భర్తీ కోసం ఈ నెలాఖరులోకానీ, వచ్చే నెల మొదటి వారంలోకానీ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి కేటాయించిన టిఆర్‌ఎస్‌కు చెందిన కె కేశవరావు, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్‌ అలీఖాన్‌, టి సుబ్బరామిరెడ్డి, టిడిపి ఎంపి తోట సీతామహాలక్ష్మి ఈ ఏప్రిల్‌లో పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో నాలుగు ఖాళీల భర్తీ ముందుకొచ్చింది.వైసీపీ కి అసెంబ్లీలో 151 స్థానాలు ఉన్నాయి కాబట్టి 4 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.టీడీపీ కి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు.

ఈ నాలుగు స్థానాల్లో, ఒక స్థానాన్ని చిరంజీవికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ వార్తలకు పుల్ స్టాప్ పడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Share on facebook
Share on twitter
Share on whatsapp