మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో నటించేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా లూసిఫర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మోహన్ రాజాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.
అయితే ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం లూసిఫర్ రీమేక్ ను జనవరి 20 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి.