120 మంది ప్రయాణిస్తున్న విమానం యమర్జన్జీ ల్యాండింగ్

హైదరాబాద్ : సినీ హీరో చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం యమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. మెగాస్టార్ హైదరాబాద్ వస్తుండగా ఈ ఫ్లయిట్ యమర్జన్సీ ల్యాండింగ్ అయినట్టు చెబుతున్నారు. చిరంజీవితో పాటు ఇదే ఫ్లయిట్‌లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఫోటోతో సహా వాట్సాప్‌లో తన మిత్రులకు షేర్ చేయడంతో ఫ్లయిట్ యమర్జన్సీ ల్యాండింగ్ విషయం బయటకు వచ్చింది. సాంకేతిక కారణాల వల్లే విమానాన్ని యమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సివచ్చినట్టు చెబుతున్నారు. ఇది ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ సంస్థకు చెందిన విమానం. సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమై విమానాన్నివెనక్కి తీసుకెళ్లి దించేశారు. టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని వెనక్కి తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ఆ ప్రయాణికుడి ద్వారా తెలిసింది. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. తర్వాత వీరికి మరో విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపారు. చిరంజీవి ఈ విమానంలో వున్నట్టు ఆ ప్రయాణికుడి ద్వారానే అందరికీ తెలిసింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో అతను షేర్ చేశాడు.