పూనకాలు లోడింగ్ జరిగిపోతోంది. బాబీ దర్శకత్వం ప్రతిభతో, బాస్ ఊర మాస్ గెటప్ తో, గళ్ళలుంగీ స్టెప్పులతో అభిమానుల చెంతకు వస్తోంది మెగా మాస్ మూవీ వాల్తేరు వీరయ్య. దేవీశ్రీ తరహా మాస్ బీట్స్ తో అభిమానుల ఫుల్ మీల్స్ పెట్టబోతోంది.
ఇప్పటికే రిలీజైన మూడు పాటలూ అభిమానుల పల్స్ రేట్ పెంచాయి. తాజాగా మరో మాస్ పాటని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్’ అంటూ సాగే ఈ పాటలో నిజంగానే దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో పూనకాలు లోడ్ చేసాడు. అనురాగ్ రామ్ మిరియాల, రోల్ రిడా కలిసి అద్భుతంగా ఆలపించారు.
ఇందులో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ …పూనకాల లోడింగ్ అంటూ చిరు గొంతు సవరించారు. దీనికి మాస్ మహరాజ్ కూడా వంతకలిపారు. పండగ వాతావరణాన్ని దండిగా దట్టించిన ఈ పాట, హైస్పీడ్ తో దూసుకుపోతోంది. మరి వాల్తేర్ వీరయ్య మెగా ఫుల్ మీల్స్ దక్కాలంటే జనవరి 13 దాకా వెయిట్ చెయ్యాల్సిందే..!