మెగా స్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ఈ ఇంటిని ఎంతో ఇష్టం గా కట్టుకుంటున్నారట. కాబట్టి ఈ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్, అలంకరణ అంతా చిరంజీవే దగ్గరుండి డిజైన్ చేయించుకుంటున్నారని, ఇదే విషయాన్ని ఆ భవంతికి డిజైన్ అండ్ ప్లానింగ్ చేసిన తహిలియానీ హోమ్స్ నిర్వాహకుల్లో ఒకరైన జహన్ తహిలియానీ చెప్పారు.
25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఇంట్లో సకల సదుపాయాలు ఉంటాయని, ముఖ్యంగా బెడ్ రూం తయారు చేసేందుకు నగలను తయారు చేసేందుకు ఉపయోగించే పచ్చటి రాళ్లతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటికి సంబంధించిన పనులను రామ్ చరణ్, ఉపాసనలు కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారట. హైదరాబాద్ సంస్కృతికి అద్దం పట్టే విదంగా ఇంటి నిర్మాణం ఉండబోతుందట. ఇల్లు ప్రారంభోత్సవానికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నారట.