మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆచార్య సినిమా కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆచార్య నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
దీనితో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇది మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా కూడా చేస్తున్నాడు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా నటిస్తోంది. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు మెగాస్టార్‌ని సుకుమార్ డైరెక్షన్ చేయబోతున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, సుకుమార్ దర్శకత్వం వహించేది సినిమా కాదు, కమర్షియల్. ఇక ఈ కమర్షియల్ అనౌన్స్‌మెంట్ కోసమే సుకుమార్ మెగాస్టార్ లుక్‌ని పూర్తిగా మార్చేశాడని వినికిడి. మెగాస్టార్ లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో, చిరు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.