పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మలయాళం సినిమా లూసిఫర్. ఈ సినిమాలో కథానాయకుడిగా మోహన్ లాల్ నటించారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించి, రికార్డు కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. మోహన్ లాల్ పాత్రలో మెగా స్టార్ చిరంజీవి నటించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా రీమేక్ కు సంబంధించి స్క్రిప్ట్ పనులన్నీ దర్శకుడు తెలుగు డైరెక్టర్ సుకుమార్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
అయితే కథ సుకుమార్ సిద్ధం చేసినప్పటికీ దర్శకత్వం ఇంకొరికి అప్పగిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా పనుల్లో సుకుమార్ బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.